కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలలో ఇది ఒకటి. జిల్లాలో చాలా మట్టుకు ఏజెన్సీ ప్రాంతాలే. 2018 లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ జిల్లా కు వచ్చిన ముఖ్యమంత్రి.. జిల్లాలో పోడు రైతులకు స్వయంగా పట్టాలిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతేడాది ప్రభుత్వం పోడు భుములకు దరఖాస్తులు స్వీకరించడంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 30వేలకు పైగాదరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఏజెన్సీ ప్రాంతాలే అధికం. సాగు చేసుకుంటున్న భూమిలో చెట్లు నాటి అంతే పరిమాణంతో వేరే చోట భూమిని ఇస్తామని అటవీ అధికారులు చెబుతుండటంతో ఏంచేయాలో పాలుపోక గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తుల పరిశీలన కోసం మూడుస్థాయిల్లో కమిటీలు వేసిన ప్రభుత్వం.. 8నెలలు గడుస్తున్నా వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయటం లేదు. ఖరీఫ్ సీజన్ మెుదలవడంతో.. తమ భూమి వద్దకు వెళ్తే కేసులు పెడతారేమోనని భయంతో వ్యవసాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు.అధికారుల మాత్రం త్వరలోనే పట్టాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు.
ఇవీ చూడండి: