గిరిజనుల కోసం రూపొందించిన 3 నెంబర్ జీవో అమలు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహా రావు, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్చంద్ నాయక్, గిరిజనులు పాల్గొన్నారు. 3 నెంబర్ జీవోను అమలు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఇవీ చూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్