భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బర్లగూడెం జంగాలపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోడు భూముల్లో కందకం పనులు చేసేందుకు వచ్చిన అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని రైతులు వాగ్వాదానికి దిగారు. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది.
దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని.. వారికి పట్టాలు ఇవ్వాలని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. 2005 సంవత్సరం కంటే ముందు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఇటీవల అటవీశాఖ అధికారులకు సూచించారు.
మూడు రోజుల క్రితం పోడు భూముల్లో కందకం పనులు చేసేందుకు వచ్చిన అటవీశాఖ సిబ్బందిని జడ్పీ ఛైర్మన్ అడ్డుకోగా.. మళ్లీ అటవీ శాఖ ఆధ్వర్యంలో పనుల ప్రారంభానికి సన్నద్ధమవడం గమనార్హం.
ఇదీ చూడండి: చెరువులు కనపడటమే పాపం.. వ్యర్థాలతో నింపేస్తున్నారు!