భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మరణం పట్ల శాసనసభ్యుడు పొదెం వీరయ్య నివాళులు అర్పించారు. అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణం చెందడంపై వీరయ్య విచారం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ బారిన పడి చనిపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భద్రాచలం ప్రజలకు ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. రాజయ్య మృతి పట్ల నియోజకవర్గ ప్రజలంతా కన్నీరుమున్నీరు అవుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు కష్ట కాలం నుంచి త్వరగా కోలుకోవాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఉస్మానియాకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తాం: హైకోర్టు