భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 39 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్ర పనులను ఈఎమ్డీ డైరెక్టర్ సత్యనారాయణ, అధికారుల బృందం పరిశీలించింది. కొవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయినప్పటికీ.. పూర్తి కాకుండా ఉన్న పనుల జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.
సింగరేణి సంస్థలో మొదటి విభాగంలో 129 మెగావాట్ల విద్యుత్తు కోసం రామగుండంలో 50, మణుగూరులో 30, సత్తుపల్లిలో 10, ఇల్లందులో 39 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కోసం 220 హెక్టార్ల స్థలంలో పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మరో నెల రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయని తెలిపారు. ఆ ప్రాజెక్టులు పూర్తైతే సింగరేణి సంస్థకు ఖర్చులు తగ్గుతాయని.. రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి మరింత మెరుగుదల సాధిస్తుందని ఈఎమ్డీ డైరెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఆ ఆలయాలకు పాలకవర్గ నియామకం లేదు