భద్రాచలంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు గస్తీ చేపట్టారు. ఉదయం 6 గంటలకు విధుల్లోకి చేరేందుకు వచ్చిన ఐదుగురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఎస్పీ రాజేశ్ చంద్ర దగ్గర ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. విధుల్లో చేరేందుకు వస్తున్న కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీచూడండి: టీ హబ్లో ఎన్పీసీఐ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభం