ETV Bharat / state

ఇల్లందులో టెండర్​ ఓటు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఒకరి బదులు వేరొకరు ఓటేశారని తెలియడంతో కాస్త అలజడి రేగింది. అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటును మరొకరికెలా కేటాయిస్తారంటూ బాధిత మహిళ అధికారులపై మండి పడింది.

Tender vote registerd in MLC elections in illandhu bhadradri kothagudem
ఇల్లందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెండర్​ ఓటు నమోదు
author img

By

Published : Mar 14, 2021, 7:55 PM IST

Updated : Mar 14, 2021, 10:14 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెండర్​ ఓటు నమోదైంది. 220వ నంబరు పోలింగ్ బూత్​లో శనిగరపు రాధ అనే మహిళ ఓటును మరోకరు వినియోగించుకున్నారు. అసలు ఓటరు.. ఓటు వేసేందుకు రాగా ఈ విషయం బయటపడింది. ఫలితంగా అభ్యర్థులు పోలింగ్​ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.

అసలు ఓటర్.. ఓటును వినియోగించుకోవడాన్ని అధికారులు కాసేపు నిరాకరించారు. ఆగ్రహానికి గురైన బాధితురాలు.. 'తప్పు మీరు చేసి, నన్నెలా ఆపుతారంటూ' వారిని నిలదీసింది. తహసీల్దార్ కృష్ణవేణి​.. రాధకు 'టెండరు' ఓటు వేసే అవకాశం కల్పించారు. రాధిక అనే మరో మహిళ ఓటు వేసిందని అధికారులు గుర్తించారు. ఆమెకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు: ఓటర్ల ఆవేదన

Last Updated : Mar 14, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.