ETV Bharat / state

అమెరికాలో తెలుగువాళ్లు సురక్షితం: తానా - అమెరికా కరోనా మరణాలు న్యూస్

కరోనా ప్రభావంతో అమెరికాలో పలు రంగాలు కుదేలవుతున్నాయని, ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ తెలిపారు. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెంది గ్రామానికి చెందిన ఆయన అమెరికాలో ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

thana-president
thana-president
author img

By

Published : Apr 4, 2020, 12:46 PM IST

అమెరికాలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది?

బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసుల్లో 15 శాతం, అగ్నిమాపక శాఖ సిబ్బందిలో 20 శాతం మంది అనారోగ్యం బారిన పడినట్లు వార్తలొస్తున్నాయి. న్యూయార్క్‌ వెళ్లాలంటేనే భయంగా ఉంది. దుకాణాల్లోకి 10 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. తెలుగు ప్రజలు సురక్షితంగానే ఉన్నారు. కొందరు ప్రైవేట్‌ విమానం బుక్‌ చేసుకొని భారత్‌ వెళ్లొచ్చా అని అడుగుతున్నారు. కొందరు స్వల్పంగా అనారోగ్యం బారిన పడుతున్నా ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి ఇప్పటి వరకూ రాలేదు.

ట్రంప్‌ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఫలితం ఉంటుందా?

కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి గాడి తప్పకుండా 2.2 ట్రిలియన్‌ డాలర్ల ప్రత్యేక ప్యాకేజీని ట్రంప్‌ ప్రకటించారు. కంపెనీలు మూతపడకుండా మద్దతుగా నిలిచేందుకు ఇది కొంతవరకూ దోహదపడుతుంది. చిన్న పరిశ్రమల్లో రెండు నెలల వేతనాలను ప్రభుత్వమే ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిని కాపాడేపరంగా మంచి చర్యలే తీసుకుంటున్నారు.

తెలుగు వారికి తానా ఎటువంటి సహకారం అందిస్తోంది?

తెలుగు వారికి సహాయం చేసేందుకు తానా ముందుంటుంది. కరోనాపై అవగాహన కోసం వెబినార్‌ ద్వారా వైద్యులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. తానా నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న వైద్యులకు చెప్పి తగిన సహాయం చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల మాస్క్‌లు పంపిణీ చేశాం. తానా సహాయం అవసరమైతే 18556878262కు ఫోన్‌ చేయొచ్చు.

భారతీయ హెచ్‌-1బీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ప్రస్తుతం ఇక్కడ కంపెనీలు పూర్తిగా లాక్‌డౌన్‌ కాలేదు. 25 శాతం మంది కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. డెట్రాయిట్‌ తదితర పలు ప్రాంతాల్లో ఉత్పత్తిరంగ కంపెనీలు మూతపడ్డాయి. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఎయిన్‌ కెనడా దాదాపు 15 వేల మంది సిబ్బందిని తీసివేసింది. డెట్రాయిట్‌లో పలు హోటళ్లు, ఎయిర్‌ లైన్స్‌, ట్రావెల్‌ లాంటివి బంద్‌ అయ్యాయి. ఇప్పటివరకు కోటి కొలువులు పోయాయని, ఈ నెలాఖరుకు అది రెండు కోట్లకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. అన్ని రంగాలకు సాఫ్ట్‌వేర్‌ అవసరం కాబట్టి ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. ఫలితంగా హెచ్‌1బీ ఉద్యోగాలకూ కొంత ముప్పు ఉంటుంది. కాకపోతే ఎంత శాతం అనేది ఇప్పుడే అంచనా వేయలేం. అమెరికాలో హెచ్‌1బీ వీసాపై దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు. వారిలో కనీసం సగం మంది తెలుగు రాష్ట్రాల వారు ఉండొచ్చని అంచనా.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.