తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధూపదీప నివేదన అర్చక సంఘం రథయాత్ర నిర్వాహకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామయ్య సన్నిధిలో పూజలు నిర్వహించారు. తెరాస ప్రభుత్వం ధూపదీప నివేదన పథకం కింద ప్రతి దేవాలయానికి రూ.6 వేలు కేటాయించడం సంతోషంగా ఉందని అర్చక రథయాత్ర రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ తెలిపారు. ముఖ్యమంత్రి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని... రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సప్తనది జలాలతో హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు రథయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
సప్తనది జలాలతో 2,546 ప్రముఖ దేవాలయాల్లో ఈ పుణ్య జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17 వరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు తిరిగి అభిషేకం నిర్వహించి అనంతరం హైదరాబాదులోని కర్మన్ ఘాట్‌లోని ఆలయంలో పూర్ణాహుతి చండీ యాగం నిర్వహించనున్నట్లు వాసుదేవ శర్మ తెలిపారు.
ఈ రథయాత్రలో ప్రధాన కార్యదర్శి పిండిప్రోలు నాగ దక్షిణ మూర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తీర్థం రామకృష్ణ శర్మ, ప్రముఖులు రమేష్ శర్మ, తనుగుల మాధవశర్మ, చివుకుల శ్రీనివాస్ శర్మ దుమ్ముగూడెం మండల ఈసీ సభ్యులు రాజగోపాలచారి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అలా ఔట్ అవ్వడం దురదృష్టకరం'