తన తండ్రి జీవితకాలమంతా ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేశారని సున్నం రాజయ్య తనయుడు సీతారామరాజు తెలిపారు. తన తండ్రి మరణానికి దారితీసిన పరిస్థితులను ఆడియో రూపంలో విడుదల చేశారు. తొలుత తమ ఇంట్లో ఒకరికి కరోనా సోకితే.. హోం క్వారంటైన్లో ఉంచామన్నారు. అప్పటి నుంచే ప్రజలు తమను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసి, నిత్యం వారికి అండగా ఉండే నాన్నకే ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. అనంతరం తన తండ్రికి కరోనా నిర్ధారణ అయినప్పుడు.. ఒక్కరు కూడా ధైర్యం చెప్పడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలూ వివక్ష చూపారని వాపోయారు. ఇందుకు ప్రభుత్వం సైతం ఓ కారణమన్నారు. తామూ ఎంత చెప్పినా కోలుకోలేదన్నారు. ప్రజల ప్రవర్తనతో తనువు చాలించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన తన జీవిత కాలంలో ఎన్నో వ్యాధులు జయించారన్నారు. కరోనాతో తమకు దూరం అవుతారని ఊహించలేదన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం కూడా ప్రజలను భయపెట్టేలా వ్యవహరించకూడదని.. అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: కరోనా సోకి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి