ETV Bharat / state

సెలైన్ సీసాలతో.. మొక్కలు బతికిస్తున్నారు.. - హరిత పాఠశాల... ఆదర్శ పాఠశాల

ఆ పాఠశాల మారుమూల గిరిజన పల్లెలో ఉంది. కానీ మొక్కలు పెంచే విషయంలో ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలైన్​ సీసాలు పెట్టి నీటి బిందువులతో చెట్లను కాపాడుతున్నారు.

students protect trees in bhadradri kothagudem district
సెలైన్ సీసాలతో.. మొక్కలు బతికిస్తున్నారు..
author img

By

Published : Jan 31, 2020, 5:36 PM IST

సెలైన్ సీసాలతో.. మొక్కలు బతికిస్తున్నారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దిబ్బ గూడెంలోని ప్రాథమిక పాఠశాల పచ్చదనానికి నిలయమైంది. బడి ఆవరణలో అడుగుపెట్టగానే అక్కడి మొక్కలకు సెలైన్ సీసాలు కనిపిస్తాయి. కాస్త దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే తెలుస్తుంది అసలు విషయం. ఎప్పటికప్పుడు మొక్కలకు నీళ్లు అందించేందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఇలా ఏర్పాటు చేశారు.

ఆచరణగా మారిన ఆలోచన

పాఠశాలకు ఆవరణలో గల రోడ్డుకు రెండు వైపులా.. హరితహారంలో భాగంగా అధికారులు మొక్కలు నాటించారు. కానీ.. వాటి ఆలనాపాలనా విషయాన్ని మాత్రం గాలికి వదిలేశారు. మొక్కలు ఎండిపోవడాన్ని గమనించిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సెలైన్ సీసాలతో మొక్కలకు చుక్కలు చుక్కలుగా నీళ్లు పడే ఏర్పాటు చేశారు. దీంతో.. మొక్కలు మళ్లీ పచ్చబడ్డాయి. ఉదయం స్కూలుకు వచ్చినప్పుడు ఆ సెలైన్ సీసాల్లో నీళ్లు పోస్తారు. అవి సాయంత్రం దాకా వస్తాయి. మళ్లీ సాయంత్రం ఇంటికి వెళ్లిపోయేటప్పుడు మళ్లీ నీళ్లు నింపుతారు. ఇలా ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా నీళ్లు పోయడంతో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. పాఠశాల ఆవకణ అంతా పచ్చదనం పరుచుకుంది.

టీచర్లు కూడా కిందే కూర్చుంటారు..

నాలుగు గోడల మధ్య ఈ దేశ భవిష్యత్తు నిర్మాణమవుతుంది అన్నాడో మహానుభావుడు. ఆ మాట ఇక్కడ నిజమని రుజువవుతున్నది. అక్కడి గోడలే విద్యార్థులకు పాఠాలు నేర్పుతాయి. ఆయా తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల బొమ్మలను గోడల మీద చిత్రీకరించారు. ఆ బొమ్మల ఆధారంగా పిల్లలకు పాఠాలు చెప్తారు. రోజూ ఆ బొమ్మలు చూస్తుండడం వల్ల పిల్లలు ఆ పాఠాలను ఎప్పటికీ మరిచిపోరు. అంతేకాదు.. పిల్లలతో పాటు టీచర్లు కూడా.. కిందనే కూర్చుంటారు. ఇలా ఎన్నో అంశాల్లో దిబ్బగూడెం ప్రాథమిక పాఠశాల అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

ఇవీ చూడండి: పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.