భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రామయ్య రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో నాలుగో రోజు అయిన నేడు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని బేడ మండపం వద్దకు తీసుకువచ్చి ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నారు. రాజభోగం మహానివేదన అనంతరం స్వామివారు తిరువీధి సేవకు బయలుదేరనున్నారు. అధికసంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ అవతారంలో దర్శనమిస్తున్న స్వామి వారిని దర్శించడం వల్ల కుజగ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు.
ఇవీ చదవండి: