భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉన్న సింగరేణి కార్మికులు.. కరోనా బారిన పడకుండా సంస్థ యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. మణుగూరు సింగరేణి ఆసుపత్రిలో కరోనా పరీక్షలను మంగళవారం ప్రారంభించారు. వైరస్ లక్షణాలు కలిగిన వారు, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకుని అప్రమత్తంగా ఉండాలని జీఎం జక్కం రమేశ్ తెలిపారు.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు.. వారి కుటుంబసభ్యులు కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. సింగరేణి ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యశాలల్లో అందించే మందులను రోగులకు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జీఎం జక్కం రమేష్, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌కు 200 టన్నుల అమోనియం నైట్రేట్!