భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచనల మేరకు దివ్యాంగుల కోసం సదరన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 84 మంది దివ్యాంగులు ఈ క్యాంపు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో కొవిడ్ నిబంధనలతో క్యాంపు నిర్వహించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో పర్యవేక్షించారు.
వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి అందుబాటులో సదరన్ క్యాంపులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, వైద్యశాఖ అధికారులు సూచించారని డాక్టర్ సురేష్ తెలిపారు. క్యాంపునకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య శాఖ, అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: పంత్‌ను హెచ్చరించిన భారత జట్టు సెలక్టర్లు