సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తు కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో 39 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని సంస్థ ఈఅండ్‌ఎం డైరెక్టర్ డి.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్.సత్యనారాయణలు తెలిపారు. ఉత్పత్తి చేస్తున్న 39 మెగావాట్ల విద్యుత్తును శనివారం 132 కేవీ విద్యుత్తు ఉప కేంద్రానికి అనుసంధానం చేశారు.
230 ఎకరాల విస్తీర్ణంలో రూ.170 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో కృషి చేసిన ఏరియా అధికారులు, బీహెచ్‌ఈఎల్ సంస్థ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సోలార్ పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన ఇల్లందు ఏరియా అధికారులకు, బి.హెచ్.ఈ.ఎల్.సంస్థ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : విద్యాశాఖలో పలువురు ఉద్యోగుల ట్రాన్స్ఫర్