భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని బేతంపూడి సహకార సంఘంలో వ్యవసాయ అప్పు ఉన్న రైతులకు బ్యాంకు ప్రాంగణంలో అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడన్న అనుమానంతో ఒక వ్యక్తిపై సొసైటీ కార్యదర్శి ప్రేమాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బొమ్మనపల్లి కొత్త తండాకు చెందిన నరేష్ అనే వ్యక్తి బ్యాంకు ప్రాంగణంలో లక్షన్నర రూపాయలు ఏడు పాసు పుస్తకాలతో ఉండడాన్ని సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్, మరికొందరు గమనించారు. అతని వద్ద ఉన్న పాసుపుస్తకాలు, డబ్బుల విషయమై నిలదీశారు. అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అతడి వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, డబ్బులు పరిశీలించగా.. అవి అతని బంధువులకు చెందినవిగా తెలిసింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. పాస్ పుస్తకాలు డబ్బులు కలిగి ఉన్న ఆ వ్యక్తి.. తాను వడ్డీలకు అప్పు ఇవ్వడం నిజం కాదని, బంధువులకు సంబంధించిన లావాదేవీల కోసం వచ్చానని తెలిపాడు.
ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు