భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి వర్క్ షాప్ ఎదుట సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిట్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సారయ్య, ఐఎఫ్టీయూ జాతీయ నాయుకులు సాధినేని వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ నాయకులు, సీఐటీయూ నేతలు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సంపదను పరిరక్షించాల్సిన కేంద్రప్రభుత్వం... కరోనా వంక చూపిస్తూ బొగ్గుగనుల ప్రైవేటీకరణకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ జులై 2,3,4 తేదీల్లో జరిగే 72 గంటల సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!