భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలోని సింగరేణి నివాస గృహాలు ఉన్న జేకే కాలనీ, ఓల్డ్ కాలనీల్లో ఉద్యోగులకు కేటాయించిన క్వార్టర్స్‌లో బయటి వ్యక్తులు నివసిస్తున్నారని ఇల్లందు ఏరియా జీఎం సత్యనారాయణ తెలిపారు. యాజమాన్యం చేపట్టిన తనిఖీలో తెలిసిందని ఆయన వెల్లడించారు. అనధికారికంగా నివసిస్తున్న వారు వెంటనే క్వార్టర్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ పి.వి. సత్యనారాయణ తెలిపారు.
కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనధికారికంగా కంపెనీ క్వార్టర్స్‌లో నివసిస్తున్న కుటుంబాలు ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు, రాకపోకలు కొనసాగిస్తున్నారన్నారు. అలాగే క్వార్టర్స్‌లో శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు కొందరు నిర్వహిస్తున్నందున కాలనీల్లో కరోనా వైరస్ వ్యాపించుటకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. వారు వెంటనే ఖాళీ చేయాలని.. లేని పక్షంలో క్వార్టర్స్‌కు విద్యుత్, నీటి కనెక్షన్లు తొలగిస్తామని తెలిపారు. దీనిని సింగరేణి ఉద్యోగులు గమనించి సహకరించగలరని.. లేని పక్షంలో యాజమాన్యం చట్టరీత్యా తగుచర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇవీ చూడండి: ఉద్యోగాల భర్తీపై సర్కారు చేతులెత్తేసింది : కోదండరాం
'ఉద్యోగులు కానివారు వెంటనే క్వార్టర్స్ ఖాళీ చేయాలి'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి నివాస గృహాల్లో నివసిస్తున్న బయటి వ్యక్తులు వెంటనే ఖాళీ చేయాలని ఇల్లందు ఏరియా జీఎం పి.వి. సత్యనారాయణ తెలిపారు. అనధికారంగా నివసిస్తున్న కుటుంబాలు ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం వల్ల కరోనా విస్తరించే అవకాశముందన్నారు. వారు వెంటనే ఖాళీ చేయాలని... లేనిపక్షంలో విద్యుత్ , నీటి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు.