ETV Bharat / state

సింగరేణి సిమెంట్​ బస్తాలు పట్టివేత - telangana latest news

అక్రమంగా తరలిస్తున్న సింగరేణి సిమెంట్​ బస్తాల వాహనాన్ని సింగరేణి భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏరియా సింగరేణి భద్రతాధికారి శబీరుద్దీన్ తెలిపారు.

Seizure of illegally moving Singareni cement bags

author img

By

Published : May 17, 2021, 10:11 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న సింగరేణి సిమెంట్​ బస్తాల వాహనాన్ని సింగరేణి భద్రతా సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. సింగరేణి సివిల్​ పనులకు ఉపయోగించే సిమెంట్​ బస్తాలు... పట్టణంలో ఓ చోట నిల్వ ఉన్నాయి. వాటిని అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న సింగరేణి భద్రతా సిబ్బంది తోగూడెం గ్రామం వద్ద ఆ వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో 43 గ్రేడ్ కలిగిన రెండు వందల సిమెంట్ బస్తాలు ఉన్నాయి.

అనంతరం విషయం తెలుసుకున్న సింగరేణి విజిలెన్స్​ అధికారులు సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. అక్కడ మరో 240 సిమెంట్ బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏరియా సింగరేణి భద్రతాధికారి శబీరుద్దీన్ తెలిపారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.