ETV Bharat / state

'తప్పులున్నాయి... మళ్లీ విచారణ జరిపి నివేదిక ఇవ్వండి' - ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ

పాల్వంచలో గిరిజన మహిళపై జరిగిన దాడిలో లోపాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ గుర్తించింది. నిష్పక్షపాతంగా విచారణను జరిపి... పూర్తి స్థాయి నివేదికను 30 రోజుల్లోగా కమిషన్​ కార్యాలయానికి అందిచాలని అధికారులకు ఆదేశించింది.

sc-st-commission-chairman-investigation-on-attacks-a-tribal-women-issue
'తప్పులున్నాయి... మళ్లీ విచారణ జరిపి నివేదిక ఇవ్వండి'
author img

By

Published : Jul 8, 2020, 8:22 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన గిరిజన మహిళ జ్యోతి చేసిన ఫిర్యాదుపై బషీర్​బాగ్​లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో విచారణ జరిగింది. తనను ఏప్రిల్ 15న పాల్వంచలో 13 మంది తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని కమిషన్​కి ఫిర్యాదు చేసింది. స్వీకరించిన కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్... పాల్వంచ డీఎస్పీ, ఎస్సైలకు నోటిస్​లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

నేడు జరిగిన విచారణలో బాధితురాలు, పోలీసులు వారి వాదనలు వినిపించారు. సమగ్రంగా విచారించిన కమిషన్ ఇన్వెస్టిగేషన్, ఎఫ్​ఐఆర్​ నమోదులో లోపాలను గుర్తించింది. పోలీసులు సైతం నిబంధనను ఉల్లంగించారని గుర్తించారు. జ్యోతికి పూర్తి స్థాయి భద్రత కల్పించాలని... నిష్పక్షంగా మళ్లీ విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను 30 రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని... కాబట్టి వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత కమిషన్​పై ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.