కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో శుక్రవారం సంధ్యా హారతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములు బంగారు కవచాలతో స్వర్ణాలంకృతులుగా భక్తులకు దర్శనమిచ్చారు.
అష్టోత్తర శత హారతులు..
సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములను అద్దాల మండపం వద్దకు తీసుకువచ్చి.. అశ్వ, గజ, శేష, గరుడ అష్టోత్తర శత హారతులు అందించారు. ఒక్కొక్క హారతి తీసుకోవడం వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలను ఆలయ అర్చకులు వివరించారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసును ఛేదించిన హైదరాబాద్ పోలీసులు