భద్రాచలం ఇసుక ర్యాంపు నుంచి ఖమ్మం జిల్లాకు 40 వేల క్యూసెక్కు మీటర్ల ఇసుకను, భద్రాద్రి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 59 వేల క్యూసెక్కు మీటర్ల ఇసుకను తరలించేందుకు భద్రాచలంలో స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన పీసా గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి అధికారులతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు.
ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించరాదని అధికారులతో ప్రజాప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. భద్రాచలంలోని స్థానికులకు మాత్రమే 99 వేల క్యూసెక్కు మీటర్ల ఇసుకను ఉపయోగించాలని.. ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తే ఊరుకునేది లేదని అధికారులను ఎమ్మెల్యే పొదెం వీరయ్య హెచ్చరించారు.
ప్రజల సమస్యల కోసం గ్రామ సభను ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ఇసుకను తీసుకెళ్లేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం ఏంటని ఎమ్మెల్యే మండిపడ్డారు. దీనిపై ఆర్డీవో స్వర్ణలత ప్రజల అభిప్రాయం తీసుకుని కలెక్టర్‌కు తెలియజేస్తానని తెలిపారు.
ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతు