భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక ఎన్నికలలో తెరాస పార్టీని గెలిపిస్తే... మంత్రి కేటీఆర్ ఇల్లందును దత్తత తీసుకుంటారని ఎమ్మెల్యే హరిప్రియ ఎన్నికల ముందు ప్రకటించారు. తెరాస ఊహించినట్టుగానే ఇల్లందులో అత్యధిక స్థానాలతో ప్రజలు గెలిపించినప్పటికీ... ఇల్లందు దత్తత అంశంపై స్పష్టత రాకపోవడంపై పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ క్రమబద్ధీకరణ, బస్‌డిపో, మోడల్ మార్కెట్, యువతకు ఉపాధి అవకాశాలు, 15 సంవత్సరాల క్రితం రద్దయిన ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ వంటి సమస్యలు దత్తతతో పరిష్కారమవుతాయని పట్టణవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నా... దత్తతపై స్పష్టత రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఎందుకైంది.. దాని వెనకున్న కథేంటి?