ETV Bharat / state

అభయారణ్యంలో ఆ వలస జీవుల.. వేదన అరణ్యరోదన - Gaddamadugu village latest news

Problems In Tribal village: ప్రపంచం కుగ్రామంగా మారినా ఆ గ్రామాలకు నేటికీ ప్రపంచమే తెలియదు. అంతరిక్షంలో జీవంపై పరిశోధనలు జరుగుతున్న కాలంలోనూ అరణ్యంలో మగ్గిన ఆ జీవితాలకు భరోసా దక్కటం లేదు. ఆహారం కోసం ఆగచాట్లు.. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు. నమ్ముకున్న నేలపై హక్కులుండవు.. బిడ్డలను చదివించేందుకు బడులుండవు. పొట్ట చేతబట్టుకుని వచ్చిన పాపానికి అభయారణ్యంలో ఆ వలస జీవుల వేదన అరణ్యరోదనగా మారింది.

Problems In Tribal village
Problems In Tribal village
author img

By

Published : Oct 24, 2022, 1:38 PM IST

అభయారణ్యంలో ఆ వలస జీవుల వేదన అరణ్యరోదన

Problems In Tribal village: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గద్దమడుగు. 200మందికి పైగా నివసిస్తున్న ఈ గ్రామం.. 30ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రానికి వలసొచ్చింది. అప్పట్లో ఇక్కడ ఉంటానికి వీల్లేదంటూ అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవారు. దీంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించగా.. 2002లో ఇక్కడే నివసించేందుకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పోడు భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం: చూడటానికి ఈ గిరిజనులు ఈ ప్రాంతంలో జీవిస్తున్నా అడుగడుగునా సవాళ్ల మధ్య బతుకులీడుస్తున్నారు. గద్దమడుగు రాకపోకలకు సాగించాలంటే వాగులో నుంచి ప్రయాణం చేయాలి. సాధారణంగానే బయటి ప్రాంతంతో అంతంత మాత్రంగా ఉండే సంబంధాలు.. వర్షం వచ్చిందంటే పూర్తిగా నిలిచిపోతాయి. సమీపంలో వైద్య సౌకర్యాలు లేక అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం వేయక తప్పదు. పురిటి నొప్పుల వేళ పలువురు మహిళలను తరలించే క్రమంలోనే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇతర రాష్ట్రం నుంచి వలస వచ్చారనే కారణం: ఇతర రాష్ట్రం నుంచి వలస వచ్చారనే కారణంతో అధికారులు ఇప్పటివరకు ఈ గ్రామస్థులకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయటంలేదు. గ్రామంలోని ఓ పూరిగుడిసెలో పిల్లల కోసం అంగన్‌వాడీ ఏర్పాటు చేశారు. దగ్గరలో విద్యాసౌకర్యం లేకపోవటంతో పిల్లలు చదువులకు దూరమై.. అడవులకే పరిమితమవుతున్నారు. ఏళ్ల తరబడి అటవీ ప్రాంతంలో సాగుచేసుకుని జీవిస్తున్న ఇక్కడి గిరిజనులకు పోడు భూముల పట్టాల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది.

20కిపైగా గిరిజన గూడాలు: అటు మావోయిస్టుల జాడ చెప్పాలంటూ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. వలసొచ్చిన గిరిజనులకు సంబంధించిన గద్దమడుగు ఒక్కటే కాదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 20కిపైగా గిరిజన గూడాలు ఇలాంటి కష్టాల మధ్యే వేదన అనుభవిస్తున్నాయి. ఏళ్ల తరబడి సమస్యల సుడిగుండంలో కాలం వెళ్లదీస్తున్న తమ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు.

"ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. మాకు రోడ్లు లేవు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అంబులెన్స్​ రాదు. ఇతర రాష్ట్రం నుంచి వలస వచ్చారని అధికారులు అంటున్నారు. మేము ఇక్కడికి వచ్చి 30సంవత్సరాలు అవుతుంది. ఏళ్ల తరబడి అటవీ ప్రాంతంలో సాగుచేసుకుని జీవిస్తున్నాం. అటు మావోయిస్టుల జాడ చెప్పాలంటూ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం." - స్థానికులు

ఇవీ చదవండి: భాజపాకి మరో షాక్​.. కమలం విడిచి గులాబీని పట్టుకునేందుకు సిద్ధమౌతున్న రాపోలు

'ఆ బిర్యానీ తింటే లైంగిక సామర్థ్యానికి దెబ్బ'.. హోటల్​కు అధికారుల సీల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.