భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా వైద్య , రెవెన్యూ శాఖాధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. చాలా కాలంగా నిర్వహిస్తున్న పలు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి పత్రాల విషయంపై సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తూ తమ విధుల పట్ల నిర్లక్ష్య వైఖరికి అందిన ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి భాస్కర్ తెలిపారు.
తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర్లోని రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలాంటి అనుమతులు లేనందున వాటిని సీజ్ చేసి..మరో ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతీ ఆసుపత్రికి తప్పకుండా అనుమతులు ఉండాలని లేకుంటే ఆస్పత్రులను సీజ్ చేస్తామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు.
'ప్రైవేటు ఆస్పత్రులపై వైద్యాధికారుల కొరడా'
భద్రాచలంలో ప్రభుత్వ వైద్యులు ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండకుండా అనుమతి లేని ప్రవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులు అందుకున్న జిల్లా వైద్య , రెవెన్యూ శాఖాధికారులు దాడులు చేసి అనుమతులు లేని ఆయా ఆసుపత్రులను సీజ్ చేశారు.