ETV Bharat / state

బెయిల్​ రాలేదని ఖైదీ ఆత్మహత్యాయత్నం - భద్రాచలం

బెయిల్​ రాలేదనే మనస్థాపంతో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్​జైల్​లో చోటుచేసుకుంది.

prisoner attempt to suicide in bhadrachalam sub jail
బెయిల్​ రాలేదని ఖైదీ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 18, 2020, 2:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్​జైల్​లోని ఓ ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ప్రవీణ్ కుమార్ అలియాస్ గజ(20) పలు దొంగతనాల కేసుల్లో నేరస్థుడిగా సబ్ జైల్​లో ఉన్నాడు.

బెయిల్​ రాలేదని ఖైదీ ఆత్మహత్యాయత్నం

శిక్ష అనుభవిస్తున్న అతనికి బెయిల్​ రాలేదనే మనస్థాపంతో ఆత్మహత్య యత్నించినట్లు సబ్ జైలర్ ఆనందరావు తెలిపారు. బాత్రూం తలుపుకు ఉన్న రేకుతో చెయ్యి కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆయన చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.