ETV Bharat / state

కరోనా బారినపడి గర్భిణీ మహిళ మృతి - Pregnant woman dies with corona

కరోనా బారినపడి ఓ గర్భిణీ మహిళ మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామంలో జరిగింది. మృతురాలు 7 నెలల గర్భవతి అని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

Pregnant woman dies with corona
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనాతో గర్భణీ మృతి
author img

By

Published : Jun 29, 2021, 6:19 PM IST

మరో రెండు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఓ మహిళను కరోనా వైరస్​ కాటేసింది. మహమ్మారి బారినపడి వారం క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మరణించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామంలో జరిగింది.

జిల్లాలోని చాపరాలపల్లి గ్రామానికి చెందిన చీకటి రజనీ కుమారి (32) ములకలపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్​గా పని చేస్తోంది. 7 నెలల గర్భిణీ అయిన ఆమె వారం క్రితం కరోనా బారినపడడంతో కుటంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించిన రజనీ ఈ రోజు ( మంగళవారం) మృతి చెందింది. ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పవన్​ కల్యాణ్​ సేవా సమితి సభ్యులు రామాచారి, సుభాని, సురేశ్​, దినేశ్​ పీపీఈ కిట్లు ధరించి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: MURDER: వివాహేతర సంబంధం.. కొడుకును చంపిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.