ETV Bharat / state

11 నుంచి 15 వరకు 'ప్రజా చైతన్య' పాదయాత్ర - ప్రజా చైతన్య పాదయాత్ర వార్తలు

భద్రాచలంలో ఈ నెల 11 నుంచి 15 వరకు ప్రజా చైతన్య పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు సీపీఎం నేత ఏజే రమేశ్​ తెలిపారు. పోలవరం ముంపు నుంచి భద్రాచలం పరిరక్షణ కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

bhadrachalam, praja chaitanya padayatra
భద్రాచలం, ప్రజాచైతన్య పాదయాత్ర
author img

By

Published : Feb 5, 2021, 12:38 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా సీపీఎం ఆధ్వర్యంలో.. ఈ నెల 11నుంచి 15వరకు ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకుడు ఏజే రమేశ్​ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

పోలవరం ముంపు నుంచి భద్రాచలం పరిరక్షణ, పట్టణ అభివృద్ధి కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు రమేశ్​ వివరించారు. పట్టణాన్ని మున్సిపాలిటీ కాకుండా, పంచాయతీ చేయకుండా.. ఏ విషయం అనేది తేల్చకుండా స్థానికులను ప్రభుత్వం సందిగ్ధంలో పడేసిందని ఆరోపించారు. పోలవరం ముంపు వల్ల పట్టణానికి ఎంతమేర నష్టం వాటిల్లుతుందనే విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఈ సమస్యలపై పోరాడతామని చెప్పారు.

ఇదీ చదవండి: ఎవరెన్ని కుట్రలు చేసినా తెరాస గెలుపును ఆపలేరు: పల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.