ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నందున తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన భద్రాచలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రాష్ట్రం నుంచి ఏపీలోకి అక్రమ మద్యం, నగదు రవాణా జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
పోలీసులు ప్రతీ వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు జరగనున్నందున భద్రాచలంలో ఇప్పటికే మద్యం దుకాణాలను మూసివేశారు.
ఇదీ చూడండి: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ నామినేషన్