భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీ ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కొవ్వొత్తులతో రెండు నిముషాలు మౌనం పాటించారు. ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ప్రజలంతా గుర్తించాలని ఏఎస్పీ అన్నారు.
ఇదీ చదవండిః హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్