దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న వి.హనుమంత రావును కొత్తగూడెం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా హనుమంతరావు రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షం కురుస్తుండగా ఆ జల్లులోనే తన నిరసనను వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు. తెరాస ప్రభుత్వం పోలీసులను ప్రలోభపెట్టి వారిని ఉపయోగించి తమ పబ్బం గడుపుకుందని హనుమంతరావు ఆరోపించారు. జల దీక్షకు అనుమతి లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులను పలుచోట్ల పోలీసులు ఆపుతున్నారు.
ఇదీ చూడండి : 'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'