భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దర్శించుకున్నారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను కలిసేందుకు ఆయన స్వగృహానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫలితంగా బ్రిడ్జి సెంటర్‌పై సుమారు గంటసేపు బైఠాయించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రజల కోసం పోరాడుతున్న మమ్మల్ని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని వీహెచ్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేను కలవకుండా చేయడం పోలీసులకు సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులను చూడటానికి వెళ్తుంటే అడ్డుకోవడం బాధాకరమన్నారు.
ఇదీచూడండి: 80 శాతం మొక్కలు బతక్కపోతే చట్టపరమైన చర్యలు: కేటీఆర్