వర్షాలు సమృద్ధిగా కురవాలని... పాండవుల శాపం తొలగిపోవాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సరిగా కురవకపోవటం వల్ల పత్తి చేలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా... ఆలయంలో ఐదుగురు బాలలతో పూజలు చేయించారు.
ప్రత్యేకంగా వండిన పాశాన్ని నేలపై ఉంచి బాలలతో నాకించారు. వర్షాలు సరిగా కురవకపోతే... పాండవులకు వరద పాశం పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు వివరించారు.