ETV Bharat / state

వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఇల్లందులో వామపక్ష పార్టీల నిరసన - cpm,cpi latest protest

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏఐకేఎస్​సీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

opposition party leaders protest against central government farmer bills at illandu
వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఇల్లందులో వామపక్ష పార్టీల నిరసన
author img

By

Published : Nov 5, 2020, 4:33 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏఐకేఎస్​సీసీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల నేతలు నిరసనకు దిగారు. రైతు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్​ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతు నడ్డి విరిచే ప్రయత్నాలు మానుకోవాలంటూ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు.

దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా సీపీఐఎంఎల్, న్యూడెమోక్రసీ సీపీఐ, సీపీఎం వామపక్షాల ఆధ్వర్యంలో ఇల్లందు ప్రధాన రహదారులను దిగ్బంధనం చేశారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండిః వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఖమ్మంలో వామపక్షాల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.