భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు ఆందోళనకు దిగి మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేశారు. అనంతరం 20 రెండు పడక గదుల ఇళ్లను పువ్వాడ ప్రారంభించారు.
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం దమ్మపేట మండలంలోని గండుగులపల్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి పువ్వాడ, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పువ్వాడ, నామా.. తుమ్మల ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదీ చదవండి: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారు: తరుణ్ చుగ్