ETV Bharat / state

ఆన్​లైన్​ చదువులకు సర్వం సిద్ధం.. సెప్టెంబర్​ 1 నుంచి షురూ! - online classes to start from september 1 in khammam

సర్కారీ బడుల తలుపులు ఎట్టకేలకు తెరచుకోనున్నాయి. జూన్‌లో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు కొవిడ్‌ కారణంగా ఐదు నెలలు ఆలస్యం అయింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ సర్వసన్నద్ధమవుతోంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది.

online classes attendance in khammam district
ఆన్​లైన్​ చదువులకు సర్వం సిద్ధం.. సెప్టెంబర్​ 1 నుంచి షురూ!
author img

By

Published : Aug 26, 2020, 11:00 AM IST

కరోనా మహమ్మారి పుణ్యమా అని జూన్​లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ముందుగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తారు. ఇందుకు అవసరమైన సామగ్రిని కూడా సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తయారు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయులు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌ బోధనకు అవసరమైన ఏర్పాట్ల గురించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దూరదర్శన్‌, టీ-శాట్‌ ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందుబాటులోకి తేనున్నారు.

సౌకర్యాలపై సర్వే

ఎన్ని పాఠశాలల్లో టీవీలు, డీటీహెచ్‌లు ఉన్నాయి. వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి. పని చేస్తున్న పాఠశాలల్లో విద్యుత్తు సౌకర్యం ఉందా లేదా అనే విషయం గురించి ఇప్పటికే ఉపాధ్యాయులు వివరాలు సేకరించారు. అదే విధంగా విద్యార్థుల సంఖ్య, వారిలో ల్యాప్‌టాప్‌లు, చరవాణిలు, ఇంటర్నెట్‌ సౌకర్యం, వాట్సప్‌ గ్రూపుల్లో ఉన్నవారు ఎంతమంది? లేనివారి సంఖ్య గురించి ఉపాధ్యాయులు సర్వే చేశారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి

టీవీలు, చరవాణిలు అందుబాటులో లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. సంబంధిత విద్యార్థికి దగ్గర్లో ఉన్న ముగ్గుర్ని కలిపి ఒక బ్యాచ్‌గా తయారు చేస్తారు. ఇలాంటి అవకాశం కూడా లేని ప్రాంతాల్లో ఏదైనా గ్రామ పంచాయతీలో టీవీ ఉందా లేక అందుబాటులో ఉన్న ఎన్‌జీవో సహకారం తీసుకోవటం లేదా పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవటం ద్వారా సంబంధిత విద్యార్థికి ఆన్‌లైన్‌ పాఠాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తారు.

మ్యా చింగ్‌ అండ్‌ బ్యాచింగ్‌: విద్యార్థులను ఉపాధ్యాయులతో అనుసంధానం చేయటం ద్వారా ‘మ్యాచింగ్‌ అండ్‌ బ్యాచింగ్‌’ చేసి విద్యార్థులు పాఠాలు వింటున్నారా లేదా వారికి సబ్జెక్టు పరంగా ఏవైనా సందేహాలు ఉన్నాయా అనే విషయాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తారు.

నిరంతర విద్యుత్తు సౌకర్యం

ఆన్‌లైన్‌ బోధనకు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం పాఠశాలలకు నిరంతరం విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. విద్యుత్తుశాఖకు సంబంధించిన ఏఈ, లైన్‌మన్‌ల చరవాణిలో దగ్గర ఉంచుకుని సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే వారిని సంప్రదించాలని ఉపాధ్యాయులను కోరారు. ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు ఉంటే వాటి వివరాలు కూడా తెలియచేయాలని ఆదేశించారు.

ప్రవేశాలకు మార్గదర్శకాలు

ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రవేశాలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు పాఠశాలలకు రాకుండా కేవలం వారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చేపట్టాలి. ఈనేపథ్యంలో వలస కార్మికుల పిల్లలకు సంబంధించి కూడా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలి. త్వరలో పాఠశాలలు కూడా ప్రారంభించే అవకాశం ఉన్నందున విద్యార్థుల సమదుస్తులను కూడా సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

సమన్వయంతో సమస్యలు పరిష్కారం

విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామపంచాయతీలతో సమన్వయ సమావేశం నిర్వహించి ఈఏర్పాట్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో కలిసి పాఠశాల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత స్థానిక గ్రామ పంచాయతీలదే. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ బోధనకు సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 4,500 మంది ఉపాధ్యాయులకు నైపుణ్యశిక్షణ ఇచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులపై ఉపాధ్యాయుల సర్వేలో వెల్లడైన అంశాలు

  • 3-10 తరగతుల విద్యార్థులు మొత్తం: 74,042
  • చరవాణి ఉన్నవారు: 52,896
  • టీవీతో డీటీహెచ్‌ సౌకర్యం: 21,132
  • టీవీతో పాటు కేబుల్‌ కనెక్షన్‌: 46,557
  • చరవాణితో పాటు ఇంటర్నెట్‌ సౌకర్యం: 23,164
  • చరవాణి ఉండి ఇంటర్నెట్‌ సౌకర్యం లేనివారు: 31,504
  • ఇంటర్నెట్‌తో పాటు డెస్క్‌ట్యాప్‌/ల్యాప్‌ట్యాప్‌: 151
  • గ్రామ పంచాయతీ ద్వారా టీవీ సౌకర్యం: 10,714
  • డిజిటల్‌ డివైజ్‌ టీవీతో అనుసంధానం లేని విద్యార్థులు: 10,714
  • డిజిటల్‌ డివైజ్‌ టీవీతో డీటీహెచ్‌/కేబుల్‌, డెస్‌ట్యాప్‌/చరవాణితో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న వారు: 63,328

కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ విద్యాబోధన ప్రారంభిస్తాం. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రారంభమయ్యే ఆన్‌లైన్‌ విద్యాబోధనకు అనుగుణంగా పాఠశాలల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందు కోసం ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నాం. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీల సహకారంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆన్‌లైన్‌ బోధనకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ఇప్పటికే నైపుణ్యాల శిక్షణ పూర్తి చేశాం. తగిన విధంగా పాఠశాలలను తీర్చిదిద్దుతాం.

-పి.మదన్‌మోహన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, ఖమ్మం

జిల్లాలో పాఠశాలలువిద్యార్థుల సంఖ్య
ప్రాథమిక811 36,416
ప్రాథమికోన్నత 192 10,839
ఉన్నత211 42,042

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.