భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ చైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నీరజ్ ప్రతిభ కనబరిచాడు. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు మార్గాలు కనుకొన్నాడు. కరోనా బాధితులకు యాంటీ మెడిసిన్ డయాలసిస్ చేయడం, శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాల్ని అందిచడం, ఎండ తగలడం వల్ల వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని తెలిపాడు.
నీరజ్ ఈ విషయాల్ని ముగ్గురు వైద్యులకు వివరించగా... వారు కూడా అంగీకరించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌కు ట్విట్టర్లో తెలిపినట్టు నీరజ్ వెల్లడించాడు. కానీ మంత్రుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు. విద్యార్థి ప్రతిభను పాఠశాల యాజమాన్యంతో పాటు పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్