ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పట్టణ పరిధిలో రూ.1.20 కోట్లతో నూతనంగా నిర్మించిన తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రేగా కాంతారావు అన్నారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం..
ఆరోగ్య ఉప కేంద్రాలతో.. ప్రజలకు వైద్యం మరింత సులువు కానుందని రేగా కాంతారావు తెలిపారు. కరోనా వైరస్ నివారణలో ప్రజల భాగస్వామ్యం మరికొంత పెరగాలని.. ప్రతి ఒక్కరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నియమాలను పాటించాలని సూచించారు. వైరస్ సోకిన రోగులకు ప్రభుత్వం మంచి వైద్యం అందిస్తోందని.. అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం ధరలు నిర్ణయించిందని కాంతారావు గుర్తు చేశారు.
ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు