ఖమ్మం జిల్లాలో కొత్తగా ఐదుగురు కరోనా బారిన పడ్డారు. ఖమ్మం నగరంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. రోటరీనగర్‌కు చెందిన ఓ యువకుడితోపాటు సారధినగర్‌లో ఓ యువతికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఎన్‌ఎస్‌టీ రోడ్డులో మరో వ్యక్తికి మహమ్మారి సోకింది.
వీరితో పాటు వేంసూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృత్యువాతపడగా.. దెందుకూరులో ఓ మహిళకు వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్ బాధితుల సంఖ్య 55కు చేరగా.. 25 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాల్వంచలోని కేటీపీఎస్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి వైరస్ సోకింది. కొత్తగూడెం సింగరేణి గౌతమ్ పూర్ కాలనీలో సింగరేణి కార్మికుడి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 16 కేసులు నమోదుకాగా.. 9 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.