భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎంపీటీసీ మండల రాముపై దుండగులు హత్యాయత్నం చేశారు. రాము ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారులో వచ్చి ఢీకొట్టారు. ఆపై కారంపొడి చల్లి.. గొడ్డలి, ఇనుప రాడ్లతో దాడి చేసే యత్నం చేశారు. ప్రతిఘటించిన ఎంపీటీసీ ప్రాణాలు దక్కించుకున్నారు.
దుండగులు కారును అక్కడే వదిలి పారిపోయారు. కాళ్లకు గాయం కావడం వల్ల రామును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ