ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి రామయ్య సన్నిధి ముస్తాబైంది. నేటినుంచి జనవరి 16 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో ముందు పది రోజులు పగలు ఉత్సవాలు... తర్వాత పది రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా కౌసల్యానందనుడు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడు.
రోజుకో అవతారంలో..
మత్స్యావతారం, కూర్మావతారం,వరాహావతారం, నరసింహావతారం, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ ఇలా రోజుకో అవతారల్లో రఘుకుల తిలకుడు భక్తులను అనుగ్రహించనున్నాడు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 5న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 6న ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ప్రత్యేక ఏర్పాట్లు
ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామయ్య సన్నిధి పరిసరాలన్నీ సుందరంగా తీర్చిదిద్దారు. కల్యణమండపంతో పాటు ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ళ ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: సంక్రాంతికి సంసిద్ధం: జనవరి 10 నుంచి ప్రత్యేక బస్సులు