ETV Bharat / state

ఇల్లందు బుగ్గవాగును సందర్శించిన ఎంపీ కవిత!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత పర్యటించారు. ఇల్లందులోని బుగ్గవాగును పరిశీలించి పురపాలక సంఘ పాలక వర్గాన్ని అభినందించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పట్టణంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని సూచించారు.

MP Maloth Kavitha Visits Illandu Bugga Vaagu
ఇల్లందు బుగ్గవాగును సందర్శించిన ఎంపీ కవిత!
author img

By

Published : Aug 19, 2020, 10:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత పర్యటించారు. ఇల్లందు పట్టణంలో ప్రక్షాళన చేసిన బుగ్గవాగును సందర్శించి పురపాలక సంఘం పాలక వర్గాన్ని అభినందించారు. అలుగు పోస్తున్న పాడు చెరువును పరిశీలించారు. పట్టణంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయని పురపాలక సంఘం సిబ్బందిని ప్రశంసించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సీజనల్​ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రాచలంలోని గోదావరి నది ముంపు ప్రాంతాలను పరిశీలించి ఇల్లందుకు వచ్చినట్టు ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్​ దిండిగల రాజేందర్​, పురపాలక ఛైర్మన్​ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.