ETV Bharat / state

కొనసాగుతున్న మోడల్​ మార్కెట్​, మినీస్టేడియం నిర్మాణ పనులు

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇల్లెందులో నిలిచిపోయిన మోడల్​ మార్కెట్​, గ్రీన్​ ఫీల్డ్​ స్టేడియం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మార్కెట్​ నిర్మాణం కోసం పట్టణంలోని చిరువ్యాపారులు ఎదురుచూస్తున్నారు.

author img

By

Published : May 21, 2020, 11:07 PM IST

model market and mini stadium works
model market and mini stadium works

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో లాక్​డౌన్​ నేపథ్యంలో నిలిచిపోయిన మోడల్ మార్కెట్ నిర్మాణం ఇటీవల పునఃప్రారంభమైంది. మార్కెట్​ నిర్మాణం పూర్తి కావడం కోసం పట్టణంలోని చిరువ్యాాపారులు ఎదురుచూస్తున్నారు. పట్టణంలో నిర్మితమవుతున్న గ్రీన్​ ఫీల్డ్​ స్టేడియం నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి.

పట్టణంలో ఇటీవల మినీ స్టేడియం నిర్మాణం పేరిట ఇసుక దందా నడుస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో మినీ స్టేడియం నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లు స్పందించారు. తమకు తగినంత ఇసుక నిల్వలు ప్రస్తుతానికి ఉన్నాయని, తమ పేరిట జరుగుతున్న రవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరారు. అవసరముంటే ఇసుక నిల్వలు అయిపోయిన తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకుంటామని కాంట్రాక్టర్లు అధికారులకు తెలిపారు.

ఇవీ చూడండి: 'ఆదాయాన్నిచ్చే పంటలు వేసేలా రైతులను ఒప్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.