భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. నియోజకవర్గంలోని రైతులు పండించిన కంది పంటను ఈ కేంద్రం ద్వారా కొనుగోలు చేయనున్నారు.
మార్కెట్కు తీసుకొచ్చే కందులను పూర్తిగా ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచించారు. రైతులంతా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.