ETV Bharat / state

రాఘవను పోలీస్‌ విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా: వనమా - కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వనమా లేఖ

MLA VANAMA
MLA VANAMA l
author img

By

Published : Jan 6, 2022, 2:45 PM IST

Updated : Jan 6, 2022, 4:10 PM IST

14:39 January 06

కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వనమా లేఖ

VANAMA VENKATESHWARA RAO: భద్రాద్రి జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 40 రోజులుగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న తనకు.. పాల్వంచ ఘటన మనోవేదనకు గురిచేసిందన్నారు. ఇందులో తన కుమారుడు పాత్ర ఉందని వస్తున్న వార్తలతో మరింత క్షోభకు గురవుతున్నానని తెలిపారు.

పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. తన కుమారుడు రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాఘవ నిర్దోశిత్వాన్ని నిరూపించుకునే వరకు నియోజకవర్గానికి దూరంగా ఉంచుతానని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా రాఘవను దూరంగా ఉంచుతానన్నారు. ఉద్దేశపూర్వకంగా తనతో పాటు తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని వనమా మండిపడ్డారు. పార్టీలు, వ్యక్తుల ఆరోపణలను తాను పట్టించుకోనని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 6, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.