ETV Bharat / state

ఆత్మ నిర్భర భారత్​తో వీధి వ్యాపారులకు చేయూత: రేగా - mla rega kantha rao distributed loans to street vendors in manuguru

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని వీధి వ్యాపారులకు ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు రుణాలు అందజేశారు. వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ పరిధిలోని 2,900 మందికి రుణాలు అందనున్నాయని చెప్పారు.

mla rega kantha rao distributed loans to street vendors in manuguru
వీధి వ్యాపారులకు రుణాలు అందజేసిన ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు
author img

By

Published : Jun 24, 2020, 7:57 PM IST

వీధి వ్యాపారులకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ పరిధిలోని 545 మంది వీధి వ్యాపారులకు మంజూరైన ఆత్మ నిర్బర నిధి కొవిడ్ రుణాలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి రేగా కాంతారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణాలు మంజూరు అయ్యాయని రేగా కాంతారావు తెలిపారు. వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ పరిధిలోని 2,900 మందికి రుణాలు అందించనున్నట్టు తెలిపారు. వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. లాక్​డౌన్ సమయంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇవీ చదవండి: పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.