భద్రాచలంలోని ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏళ్లు గడిచినా ఇప్పటివరకు పట్టించుకోలేని భాజపా నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామచంద్ర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాచలంలోని రామాలయ అభివృద్ధికి డబ్బు ఇవ్వలేను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు తాము తీసుకొస్తామని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. జిల్లాలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెరాసలో చేరి ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయారని విమర్శించారు. ఆలయానికి ఎన్నికల ప్రచారం కోసం రాలేదని.. దుబ్బాక ఎన్నికల్లో గెలిచినందుకు మొక్కు తీర్చుకునేందుకు భద్రాచలం వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఓడిపోయే సీటును పీవీ కుమార్తెకు ఇచ్చారు: రేవంత్ రెడ్డి