లాక్‌డౌన్ కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రజలకు కొందరు వ్యాపారులు చేయూత ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. పట్టణంలోని నాల్గవ వార్డులో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సెల్యూట్ చేశారు. లాక్‌డౌన్‌లో పాల్గొని... ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: 'అప్పుడే చర్యలు తీసుకుంటే పరిస్థితి బాగుండేది'