భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ ముఖ్యఅతిథిగా పాల్గొని... పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. లాక్డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో విశేషంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు పేదలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మరో వారం రోజుల పాటు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.