భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పదో వార్డులో తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరి కృషి చేయాలని... తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని అవగాహన కల్పించారు.
పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆమె అభినందనలు తెలియజేశారు. ఇల్లందు పట్టణాన్ని పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని సూచించారు.
ఇదీ చూడండి: తెలంగాణ, ఏపీల మధ్య త్వరలోనే బస్సు సర్వీసుల పునః ప్రారంభం!